మూడు పరుగుల దూరంలో…

Dec 31,2023 07:24 #Cricket, #Sports
  • ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి
  •  దీప్తి, రీచా శ్రమ వృథాశ్రీ
  • సిరీస్‌ 2-0తో ఆసీస్‌ కైవసం

ముంబయి: ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన ఏకైక టెస్ట్‌లో సంచలన విజయం సాధించిన భారత మహిళల జట్టు వన్డేల్లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో చేజార్చుకోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన రెండో వన్డేలో టీమిండియా మూడు పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 258పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్మన్‌ప్రీత్‌ సేన్‌ నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 8వికెట్లు కోల్పోయి 255పరుగులే చేయగల్గింది. చివరి 18బంతుల్లో 22పరుగులు చేస్తే గెలిచే అవకాశమున్నా.. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ బ్యాటర్లలో యువకెరటం లిచ్‌ఫీల్డ్‌(63), ఎలిసా పెర్రీ(50) మరోసారి అర్థ శతకాలతో కదం తొక్కారు. చివర్లో అలనా కింగ్‌(28నాటౌట్‌), తహ్లియా మెక్‌గ్రాత్‌(24) ధనాధన్‌ ఆడారు. కెప్టెన్‌ అలీసా హేలీ(13) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. ఎలీసా పెర్రీ, లిచ్‌ఫీల్డ్‌ బాధ్యతగా ఆడి జట్టును ఆదుకున్నారు. అయితే.. దీప్తి శర్మ సూపర్‌ స్పెల్‌తో మిడిలార్డర్‌ను దెబ్బకొట్టింది. కానీ, చివర్లో వచ్చిన సథర్లాండ్‌(23), వరేహాం(22), మెక్‌గ్రాత్‌(24) బ్యాట్‌ ఝుళిపించడంతో కంగారూ జట్టు 250కు పైగా పరుగుల స్కోర్‌ చేయగలిగింది.

ఛేదనలో టీమిండియాను మంధాన(34), రీచా(96) ఆదుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడి స్కోర్‌బోర్డును పరుగెత్తించారు. ఆ తర్వాత వైస్‌ కెప్టెన్‌ మంధాన ఔటైనా.. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి రీచా ఘోష్‌ 3వ వికెట్‌కు ఏకంగా 88పరుగులు జతచేసింది. దీంతో టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఈ క్రమంలో జెమిమాను వారేహామ్‌ ఔట్‌ చేయడం.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా 5పరుగులకే ఔట్‌ కావడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. సెంచరీకి చేరువలో రీచా ఘోష్‌(96) ఔటవ్వడం, దీప్తి ధాటిగా బ్యాటింగ్‌ చేయకపోవడంతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో 16పరుగుల చేయాల్సిన ఉండగా.. భారత్‌ కేవలం 13పరుగులే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు సథర్లాండ్‌కు మూడు, వారేహామ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో చేజిక్కించుకోగా.. మూడో, చివరి వన్డే జనవరి 2న జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సథర్లాండ్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు..

ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్‌: లచ్‌ఫీల్డ్‌ (సి)రీచా (బి)శ్రేయాంక 63, హీలీ (బి)పూజ వస్త్రాకర్‌ 13, ఎలీసా పెర్రీ (సి)శ్రేయాంక (బి)దీప్తి 50, మూనీ (ఎల్‌బి) దీప్తి 10, మెక్‌గ్రాత్‌ (బి)దీప్తి 24, గార్డినర్‌ (సి)అమన్‌జ్యోత్‌ కౌర్‌ (బి)స్నేV్‌ా రాణా 2, సథర్లాండ్‌ (సి అండ్‌ బి)దీప్తి 23, వారేహామ్‌ (సి)స్మృతి మంధాన (బి)దీప్తి 22, అలానా కింగ్‌ (నాటౌట్‌) 28, కిమ్‌ గరాత్‌ (నాటౌట్‌) 11, అదనం 12. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 259పరుగులు.

వికెట్ల పతనం: 1/40, 2/117, 3/133, 4/160, 5/170, 6/180, 7/216, 8/219 బౌలింగ్‌: రేణుక సింగ్‌ 7-0-35-0, పూజ వస్త్రాకర్‌ 10-0-59-1, అమన్‌జ్యోత్‌ కౌర్‌ 3-0-21-0, శ్రేయాంక పాటిల్‌ 10-0-43-1, స్నేV్‌ా రాణా 10-0-59-1, దీప్తి శర్మ 10-0-38-5.

భారత మహిళల ఇన్నింగ్స్‌: యాస్టికా భాటియా (ఎల్‌బి)కిమ్‌ గరాత్‌ 14, స్మృతి మంధాన (సి)మెక్‌ గ్రాత్‌ (బి)కింగ్‌ 34, రీచా ఘోష్‌ (సి)లిచ్‌ఫిల్డ్‌ (బి)సథర్లాండ్‌ 96, జెమిమా రోడ్రిగ్స్‌ (సి)లిచ్‌ఫీల్డ్‌ (బి)వారేహామ్‌ 44, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి)హీలీ (బి)వారేహామ్‌ 5, దీప్తి (నాటౌట్‌) 24, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (బి)సథర్లాండ్‌ 4, పూజ వస్త్రాకర్‌ (సి)గార్డినర్‌ (బి)సథర్లాండ్‌ 8, హర్లిన్‌ డియోల్‌ (బి)గార్డినర్‌ 1, శ్రేయాంక పాటిల్‌ (నాటౌట్‌) 5, అదనం 20. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 255

వికెట్ల పతనం: 1/37, 2/71, 3/159, 4/171, 5/218, 6/224, 7/240, 8/243 బౌలింగ్‌: గార్డినర్‌ 10-0-46-1, బ్రౌన్‌ 7-0-37-0, కిమ్‌ గరాత్‌ 6-0-24-1, సథర్లాండ్‌ 9-0-47-3, కింగ్‌ 7-0-43-1, మెక్‌గ్రాత్‌ 4-0-15-0, వారేహామ్‌ 7-0-39-2.

➡️