టీమిండియాకు కఠిన పరీక్ష – నేడు దక్షిణాఫ్రికా యువజట్టుతో సెమీస్‌ పోరు

Feb 6,2024 10:15 #Cricket, #Sports, #u19-world-cup-2024
  • మధ్యాహ్నం 1.30గం||లకు
  • ఐసిసి(అండర్‌-19) వన్డే ప్రపంచకప్‌

జొహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌-19) వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. మంగళవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో తలపడనుంది. ఈ టైటిల్‌ను ఇప్పటికే ఐదుసార్లు ముద్దాడిన టీమిండియా.. ఈసారి లీగ్‌, సూపర్‌-6 పోటీల్లో అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత యువజట్టు లీగ్‌లో వరుస విజయాలను నమోదు చేసుకొని సూపర్‌-6 న్యూజిలాండ్‌, నేపాల్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరింది. ఇక భారత యువజట్టులో 18ఏళ్ల ముషీర్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే రెండు సెంచరీలో కొట్టిన బషీర్‌ ఖాన్‌ మొత్తం 83.50స్ట్రయిక్‌రేట్‌తో 334పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత కెప్టెన్‌ ఉదరు సహారన్‌ 61.60స్ట్రయిక్‌రేట్‌తో 304పరుగులు, సచిన్‌ దాస్‌ సూపర్‌-6 మ్యాచ్‌లో (116పరుగుల) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఇక బౌలర్ల విభాగంలో సౌమీ కుమార్‌ 2.17 ఎకానమితో 16వికెట్లు తీయగా.. అందులో మూడుసార్లు నాలుగుకు పైగా వికెట్లు కూల్చి టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నమన్‌ తివారి(9), రాజ్‌ లింబని(4) ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికా జట్టు సూపర్‌-6లో ఒక మ్యాచ్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో ఓటమితో రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. ఆతిథ్య హోదాలో ఆ జట్టు సెమీస్‌లో చెలరేగే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలో టీమిండియా మరింత జాగ్రత్తగా ఆడితే ఫైనల్‌కు చేరడం ఖాయం.

జట్లు…

భారత్‌: ఉదయ్ సహారన్‌(కెప్టెన్‌), కులకర్ణి, ఆదర్ష్‌, సచిన్‌ దాస్‌, రుద్ర మయూర్‌, ప్రియాన్షు, అవనీశ్‌(వికెట్‌ కీపర్‌), మురుగన్‌ అభిషేక్‌, రాజ్‌ లింబని, నమన్‌ తివారి, ఆరాధ్య శుక్లా.

దక్షిణాఫ్రికా: జేమ్స్‌(కెప్టెన్‌), అహేవ్య, డానియేల్‌, మహాక, మరాయిస్‌, మొకేనా, నార్టన్‌, ప్రిటోరియస్‌(వికెట్‌ కీపర్‌), రిచర్డ్‌, స్టీవ్‌ స్టోల్డ్‌, టీగర్‌/వైట్‌హెడ్‌.

➡️