దంచి కొట్టిన భారత్‌.. తొలి రోజు ఆట ముగిసే సరికి 410/7

Dec 14,2023 17:23 #Sports

ముంబై : భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత మహిళా జట్టు దంచి కొటింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి 410/7గా ఉంది. దీప్తీ 60, పూజా 4 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 25 పరుగుల వద్ద నీతి మందన్న, 47 పరుగుల వద్ద షెఫాలి వర్మ అవుట్‌ కావడంతో కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభా సతీష్‌, జెమిమా రోడ్రిగ్స్‌ ఇంగ్లాండ్‌ బౌలర్ల దాటిని ఎదుర్కున్నారు. శుభా సతీష్‌ 69, జెమిమా రోడ్రిగ్స్‌ 68, హర్మన్‌ప్రిత్‌ కౌర్‌ 49, యస్తిక 66, స్నేహ 30 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ 2 వికెట్లు తీయగా కేట్‌ క్రాస్‌, నాట్‌ స్కివర్‌-బ్రంట్‌, షార్లెట్‌ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

➡️