చరిత్ర సృష్టించిన భారత టిటి జట్లు

Mar 4,2024 21:32 #Olympics, #Table Tennis
  • పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌(టిటి) టీమ్‌ జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. ఒలింపిక్స్‌కు టీమ్‌ విభాగంలో పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ప్రపంచ టిటి ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఈ రెండు జట్లు ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. గత నెలలో బూసాన్‌ వేదికగా జరిగిన ప్రపంచ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత పురుషుల, మహిళల టీమ్‌ జట్లు ఫైనల్‌కు చేరడంతో ర్యాంకింగ్స్‌లోనూ ఎగబాకాయి. పురుషుల, మహిళల జట్లు ప్రపంచ టిటి ర్యాకింగ్స్‌లో పురుషుల జట్టు 7వ ర్యాంక్‌లో నిలువగా.. మహిళల జట్టు 13వ స్థానంలో నిలిచింది. భారత్‌తోపాటు పోలండ్‌(12), స్వీడన్‌(15), థారులాండ్‌ కూడా పారిస్‌ ఒలింపిక్స్‌కు ర్యాంకింగ్స్‌ ఆధారంగా బెర్త్‌ దక్కించుకున్నాయి.

➡️