- వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు
- దుబాయ్‌లో వేలం
ఐపీఎల్-2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను రేపు (డిసెంబరు 19) దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ వేలం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 333 మంది ఆటగాళ్ల నుంచి తమకు కావాల్సిన వాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఈసారి వేలంలో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్, జియో సినిమా ఓటీటీలో వీక్షించవచ్చు.ఆక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరిస్తారు. మల్లికా సాగర్ ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆటగాళ్ల వేలం ప్రారంభం కానుంది.
ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మధ్వల్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, మతీశా పతిరన.
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ తెందూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, బెరెన్‌డార్ఫ్, రొమారియో షెఫర్డ్ (లఖ్‌నవూ నుంచి వచ్చాడు), హార్దిక్ పాండ్య (కెప్టెన్) (గుజరాత్ నుంచి ట్రేడింగ్)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాంగే, మయాంక్ దగార్ (సన్‌రైజర్స్ నుంచి వచ్చాడు), వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్ (ముంబయి నుంచి ట్రేడింగ్)
గుజరాత్ టైటాన్స్ :డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ.
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ భాటియా, అథర్వ తైడే, రిషి ధావన్, సామ్ కరన్, సికిందర్ రజా, లివింగ్ స్టోన్, గుర్నూర్ సింగ్ బ్రార్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, విద్వత్ కావేరప్ప, కాగిసో రబాడ, నాథన్ ఎలిస్
రాజస్థాన్ రాయల్స్ : సంజూ శాంసన్ (కెప్టెన్) , జోస్ బట్లర్, హెట్మయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనొవాన్ పెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైని, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్ ఖాన్ (లఖ్‌నవూ నుంచి వచ్చాడు)
ఢిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, యశ్ ధూల్, ప్రవీణ్ దూబె, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేశ్ కుమార్.
కోల్‌కతా నైట్‌రైడర్స్ : నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్భాజ్, శ్రేయస్ అయ్యర్, జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రె రసెల్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోడా, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి వచ్చాడు), అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫారూఖీ
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, దేవ్‌దత్ పడిక్కల్ (రాజస్థాన్ రాయల్స్ నుంచి వచ్చాడు), రవిబిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్య, యుధ్విర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్.