ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 208పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్(54) రాణించినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ నిరాశపరచడంతో కోల్‌కతా జట్టు ఓ దశలో 51పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రమణ్‌దీప్(35) జత కలవడంతో సాల్ట్-రమణ్ దీప్ 5వ వికెట్‌కు 54పరుగులు జతచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ వెంట వెంటనే ఔటయ్యాక ఆండీ రస్సెల్(64నాటౌట్; 25బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సర్లు)కి తోడు రింకు సింగ్(23; 15బంతుల్లో 3ఫోర్లు) 7వ వికెట్‌కు 81పరుగులు జతచేశారు. కోల్‌కతా జట్టు చివరి 30 బంతుల్లో 85పరుగులు జతచేసి భారీస్కోర్‌ను దోహదపడ్డారు. సన్‌రైజర్స్ బౌలర్లు నటరాజన్‌కు మూడు, మార్కండేకు రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో 145/5 స్థితిలో హైదరాబాద్ ఓటమి లాంఛనమే అని భావించిన సమయంలో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లో 63 పరుగులు బాదాడు. చివరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరమవ్వగా 19వ ఓవర్లో క్లాసెన్ 3 సిక్సర్లు, షాబాజ్ 1 సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా క్లాసెన్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది. 3వ బాల్కి షాబాజ్ ఖాన్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్సెన్ సింగిల్ తీసి క్లాసెన్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. క్లాసెన్ 5వ బంతికి ఔట్ అయ్యాడు. ఇక సమీకరణం చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా క్రీజులో ఉన్న హైదరాబద్ కెప్టెన్ పాట్ కమిన్స్ విఫలమయ్యాడు. దీంతో ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32),రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (18), అబ్దుల్ సమద్ (15), షాబాజ్ అహ్మద్ (16) కీలకమైన పరుగులు చేశారు. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 కీలకమైన వికెట్లు తీశాడు. ఆండ్య్రూ రస్సెల్ 2, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో వికెట్ తీశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/srj.jpg)