ఫైనల్‌కు కోల్‌కతా

May 22,2024 08:38

సైన్‌రైజర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ ఘన విజయం
నిప్పులు చెరిగిన స్టార్క్‌

అహ్మదాబాద్‌ : రెండుసార్లు టైటిల్‌ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను కోల్‌కతా పేసర్‌ స్టార్క్‌(3/34) దెబ్బ తీసాడు. స్టార్‌ ఓపెనర్లు హెడ్‌(0), నితీశ్‌ రెడ్డి(9), షాబాజ్‌(0)లను ఔట్‌చేశాడు. దీంతో సన్‌రైజర్స్‌ 39పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌ను త్రిపాఠి అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. దీంతో 19.3ఓవర్లలో 159పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు 13.4 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 164పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్టార్క్‌కు లభించింది.
టాస్‌ గెలిచిన కమిన్స్‌ బ్యాటింగ్‌ తీసుకొని భారీ మూల్యమే చెల్లించాడు. 13 పరుగులకే ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. తొలి ఓవర్లోనే ట్రావిస్‌ హెడ్‌(0)ను సూపర్‌ యార్కర్‌తో మిచెల్‌ స్టార్క్‌ వెనక్కి పంపి సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. రెండో ఓవర్లోనే డేంజరస్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(3) సైతం ఔట్‌ చేరడంతో హైదరాబాద్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే.. రాహుల్‌ త్రిపాఠి(55) అద్భుతంగా పోరాడాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌(32) అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో 13 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 121పరుగులతో పటిష్టంగా ఉన్న హైదరాబాద్‌ ఐదు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్‌ త్రిపాఠి(55) అర్ధ సెంచరీ పూర్తిచేసి క్రీజ్‌లో నిలదొక్కుకొని ఉన్న దశలో అబ్దుల్‌ సమద్‌ అనవసర పరుగుకు త్రిపాఠిని రనౌట్‌ చేశాడు. ఆ రనౌట్‌ సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ తర్వాత సన్వీర్‌(0), భువనేశ్వర్‌(0), అబ్దుల్‌ సమద్‌(16) వరుసగా ఔటవ్వడంతో 9వికెట్ల నష్టానికి 126పరుగులే చేసింది. చివరి వికెట్‌కు స్టార్క్‌-విజరుకాంత్‌ 33పరుగులు జతచేయడంతో 159పరుగుల గౌరవప్రదస్కోర్‌ చేసింది. కెప్టెన్‌ స్టార్క్‌(30) ఆదుకోగా.. విజరుకాంత్‌(7నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. కోల్‌కతా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌(3/34) విజృంభణకి తోడు వరణ్‌ చక్రవర్తికి రెండు, నరైన్‌, వైభవ్‌, హర్షీత్‌, రస్సెల్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

ఛేదనలో కోల్‌కతా ఓపెనర్లు గుర్బాజ్‌(23), నరైన్‌(21) తొలి వికెట్‌కు 44పరుగులు జతచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనా.. శ్రేయస్‌ బ్రదర్స్‌ మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. వెంకటేశ్‌ అయ్యర్‌(51), శ్రేయస్‌ అయ్యర్‌(55) అర్ధసెంచరీలతో రాణించి 13.4ఓవర్లలోనూ మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపుతో కోల్‌కతా ఫైనల్‌కు చేరగా.. నేడు జరిగే ఎలిమినేటర్‌ విజేతతో సన్‌రైజర్స్‌ జట్టు 24న(శుక్రవారం) తలపడనుంది.

స్కోర్‌బోర్డు..
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి)స్టార్క్‌ 0, అభిషేక్‌ శర్మ (సి)రస్సెల్‌ (బి)వైభవ్‌ అరోరా 3, త్రిపాఠి (రనౌట్‌)రస్సెల్‌/గుర్బాజ్‌ 55, నితీశ్‌ రెడ్డి (సి)గుర్బాజ్‌ (బి)స్టార్క్‌ 9, షాబాజ్‌ అహ్మద్‌ (బి)స్టార్క్‌ 0, క్లాసెన్‌ (సి)రింకు సింగ్‌ (బి)చక్రవర్తి 32, అబ్దుల్‌ సమద్‌ (సి)శ్రేయస్‌ (బి)హర్షీత్‌ రాణా 16, సన్వీ సింగ్‌ (బి)నరైన్‌ 0, పాట్‌ కమిన్స్‌ (సి)గుర్బాజ్‌ (బి)రస్సెల్‌ 30, భువనేశ్వర్‌ కుమార్‌ (ఎల్‌బి)చక్రవర్తి 0, విజరుకాంత్‌ (నాటౌట్‌) 7, అదనం 7. (19.3ఓవర్లలో ఆలౌట్‌) 159పరుగులు. వికెట్ల పతనం: 1/0, 2/13, 3/39, 4/39, 5/101, 6/121, 7/121, 8/125, 9/126, 10/159 బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-34-3, వైభవ్‌ అరోరా 2-0-17-1, హర్షీత్‌ రాణా 4-0-27-1, సునీల్‌ నరైన్‌ 4-0-40-1, ఆండీ రస్సెల్‌ 1.3-0-15-1, వరణ్‌ చక్రవర్తి 4-0-26-2.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)వి.వ్యాషక్‌ (బి)నటరాజన్‌ 23, నరైన్‌ (సి)వ్యాషక్‌ (బి)కమిన్స్‌ 21, వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 51, శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 58, అదనం 11. (13.4 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 164పరుగులు. వికెట్ల పతనం: 1/44, 2/67 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-28-0, కమిన్స్‌ 3-0-38-1, నటరాజన్‌ 3-0-22-1, వి.వ్యాషక్‌ 2-0-22-0, హెడ్‌ 1.3-0-32-0, నితీశ్‌ రెడ్డి 1-0-13-0

➡️