పాకిస్తాన్‌కు ఊరట

Jan 21,2024 22:23 #Sports

ఐదో టి20లో న్యూజిలాండ్‌పై గెలుపు

సిరీస్‌ 4-1తో కివీస్‌ కైవసం

క్రైస్ట్‌చర్చ్‌: ఐదో, చివరి టి20లో పాకిస్తాన్‌ జట్టుకు ఊరట లభించింది. ఆదివారం జరిగిన ఐదో టి20లో పాకిస్తాన్‌ జట్టు 42పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టు 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 134పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 17.2ఓవర్లలో 92పరుగులకే ఆలౌటైంది. పాకిస్తాన్‌ జట్టులో రిజ్వాన్‌(38), ఫకర్‌(33) బ్యాటింగ్‌లో రాణించగా.. న్యూజిలాండ్‌ జట్టులో అలెన్‌(22), ఫిలిప్‌(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. పాకిస్తాన్‌ బౌలర్లు ఇప్తికార్‌కు మూడు, షాహిన్‌ అఫ్రిది, నవాజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇప్తికార్‌కు సిరీస్‌ అలెన్‌కు లభించాయి. దీంతో ఐదు టి20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 4-1తో చేజిక్కించుకుంది.

➡️