Malaysia Masters : సెమీస్‌కు సింధు

May 24,2024 22:21 #Badminton, #Sports
  • క్వార్టర్స్‌లో ఓడిన అస్మిత

కౌలాలంపూర్‌: మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి పివి సింధు ప్రవేశింశించగా.. అస్మిత చాలీహా పోరాటం క్వార్టర్‌ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పివి సింధు 21-13, 14-21, 21-12తో యుహాన్‌(చైనా)పై పోరాడి నెగ్గింది. మరో పోటీలో అస్మిత చాలీహా 10-21, 15-21తో జంగ్‌(చైనా) చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో కిరణ్‌ జార్జి ఓటమిపాలవ్వగా.. ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన ఏకైక షట్లర్‌ సింధు మాత్రమే. మూడుసెట్ల హోరాహోరీ పోరులో భాగంగా సింధు తొలి సెట్‌ను సునాయాసంగా నెగ్గింది. ఇక రెండో సెట్‌లో ఏమాత్రం ప్రతిభ కనబర్చక ఓటమిపాలైంది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పుంజుకొని మ్యాచ్‌ను ముగించింది.

➡️