స్లాట్‌లు 30.. రేసులో 165మంది

Dec 2,2023 21:34 #Sports, #women's ipl
  • 9న డబ్ల్యుపిఎల్‌ వేలం

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) రెండో సీజన్‌ వేలం బరిలో 165మంది ఆటగాళ్లు నిలిచారు. ఈ మేరకు బిసిసిఐ శనివారం ఓ ప్రకటనలో… 30మంది ఆటగాళ్లకోసం 165మంది పోటీపడుతున్నట్లు వెల్లడించింది. 165మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారని, ఇందులో 104మంది భారత క్రికెటర్లు కాగా.. 61మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారని పేర్కొంది. అలాగే మరో 15మంది అసోసియేట్‌ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని, అందులో 56మంది జాతీయ జట్టు(క్యాప్‌డ్‌)కు ఆడిన ప్లేయర్లు కాగా.. 109మంది అంతర్జాతీయ క్రికెట్‌(అన్‌క్యాప్‌డ్‌) ఆడని ప్లేయర్లు ఉన్నట్లు తెలిపింది. దీంతో 9న ముంబయి వేదికగా జరిగే వేలంలో ఐదు ఫ్రాంచైజీలు 30మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డాటిన్‌, కిమ్‌ గార్గ్‌ అత్యధికంగా రూ. 50 లక్షలతో వేలం బరిలో నిలువగా.. మరో నలుగురు ప్లేయర్లు రూ. 40 లక్షలతో వేలం బరిలో నిలిచారు. మిగిలిన వారంతా రూ.10 లక్షల కనీస ధరతో వేలంలో ఉన్నారు.

ఆయా ఫ్రాంచైజీల ఉన్న నగదు, స్లాట్స్‌ వివరాలు..

  1. ఢిల్లీ క్యాపిటల్స్‌ : 3స్లాట్ల కోసం రూ.2.25 కోట్లు 
  2. గుజరాత్‌ జెయింట్స్‌ : 10 స్లాట్ల కోసం రూ. 5.95 కోట్లు
  3. ముంబయి ఇండియన్స్‌ : 5 స్లాట్ల కోసం రూ. 2.1 కోట్లు
  4. ఆర్‌సిబి : 7 స్లాట్ల కోసం రూ. 3.35 కోట్లు 
  5. యూపి వారియర్స్‌ : 5 స్లాట్ల కోసం రూ. 4 కోట్లు
➡️