RSA vs IND : రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం

Jan 4,2024 14:43 #Cricket, #test match
  •  రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రాకు 6 వికెట్లు

కేప్‌టౌన్‌ : కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 28, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 17 (నాటౌట్‌), శుభ్‌ మాన్‌ గిల్‌ 10, విరాట్‌ కోహ్లీ 12, శ్రేయాస్‌ అయ్యర్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 1, నాండ్రే బర్గర్‌ 1, మార్కో యన్సెన్‌ 1 వికెట్‌ తీశారు.అంతకుముందు ఓవర్‌నైట్‌ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్‌క్రమ్‌ (106బీ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్‌ మాత్రం ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముకేశ్‌ కుమార్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కష్ణ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ ను టీమిండియా 1-1తో సమం చేసింది.

176 పరుగులకు సౌతాఫ్రికా అలౌట్‌

దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మరో 114 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. జస్‌ప్రీత్‌ బుమ్రా (6/61) విజృంభణతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా మార్‌క్రమ్‌ సెంచరీ సాధించాడు. 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్‌క్రమ్‌ (106- 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో రోహిత్‌కు చిక్కాడు.సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ను ఔట్‌ చేసిన బూమ్రా రెండో రోజు తొలి ఓవర్లోనే డేవిడ్‌ బెడింగ్‌హామ్‌(11), కైలీ వెరెనె(9), మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎంగిడి (8) వికెట్లను తీశాడు. రబాడ(2)ను ప్రసిద్ధ్‌ కష్ణ వెనక్కి పంపాడు. ఎల్గర్‌ , టోనీ డి జోర్జి వికెట్లను ముకేష్‌ కుమార్‌ తీశాడు.

  • 7 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా..

సౌతాఫ్రికాకేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. 63/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రొటిస్‌ జట్టు మొదటి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే డేవిడ్‌ బెడింగ్‌హామ్‌(11 పరుగుల)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. 21.1 ఓవర్‌ వద్ద కైలీ వెరెనె(9) వికెట్‌ను బూమ్రా తీశాడు. 23.5వ ఓవర్‌ వద్ద మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపి నాలుగో వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఐడెన్‌ మార్క్రమ్‌ 62, కగిసో రబడ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

➡️