స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి భద్రత ముప్పు.. ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు

May 22,2024 16:05 #2024 ipl, #rcb, #Virat Kohli

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో నేడు రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరును రాజస్థాన్‌ ఢకొీట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌ జరగనుంది. అయితే దీనికి ముందు మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ ఉండగా బెంగళూరు జట్టు అనూహ్యంగా దాన్ని రద్దు చేసుకుంది. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, కొన్ని వీడియోలు, సందేశాలను స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి బెంగళూరు, రాజస్థాన్‌ జట్లకు పోలీసులు సమాచారమిచ్చారు. ఈ క్రమంలోనే స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బెంగళూరు తన ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుందని గుజరాత్‌ పోలీసు అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

➡️