స్టోయినిస్‌ మెరవగా..!

Jun 16,2024 23:15 #Sports

స్కాట్లాంగ్రాస్‌ఐలెట్‌ : అగ్రజట్టు ఆస్ట్రేలియాను పసికూన స్కాట్లాండ్‌ భయపెట్టింది. 181 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఓ దశలో 60/3తో కష్టాల్లో కూరుకుంది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (68, 49 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్కస్‌ స్టోయినిస్‌ (59, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.4 ఓవర్లలో 5 వికెట్ట నష్టానికి 186 పరుగులు చేసింది. డెవిడ్‌ వార్నర్‌ (1), మిచెల్‌ మార్ష్‌ (8), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (11) విఫలమయ్యారు. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ ఓ ఎండ్‌లో దంచికొట్టగా.. ఆఖర్లో మార్కస్‌ స్టోయినిస్‌ మెరిశాడు. టిమ్‌ డెవిడ్‌ (24 నాటౌట్‌), మాథ్యూ వేడ్‌ (4 నాటౌట్‌) లాంఛనం ముగించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాటాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ములన్‌ (60, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదంతొక్కగా.. జార్జ్‌ మున్సె (35), రిచీ బెరింగ్టన్‌ (42 నాటౌట్‌) రాణించారు. మార్కస్‌ స్టోయినిస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా అగ్రస్థానంతో సూపర్‌8కు చేరుకుంది.

➡️