సూర్యకుమార్‌ ఒంటరి పోరాటం

Apr 18,2024 21:47 #Cricket, #IPL 2024 Match, #Sports
  • ముంబయి ఇండియన్స్‌ 192/7

ఛండీగడ్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం చేశాడు. సూర్యకుమార్‌ అర్ధసెంచరీకి తోడు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా చెలరేగడంతో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 192పరుగులు చేసింది. ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌(78; 53బంతుల్లో 7ఫోరుఓల, 3సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(8) రబడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడి.. బౌండరీ వద్ద హర్‌ప్రీత్‌ బ్రార్‌ చేతికి చిక్కాడు. దాంతో, 18 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ ఔటైనా గత మ్యాచ్‌లో సీఎస్కేపై సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ(36) దంచాడు. చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ కట్టడి బౌలింగ్‌ చేయడంతో ముంబయి భారీస్కోర్‌పై ఆశలు వదులుకుంది.

సామ్‌ కర్రన్‌కు పగ్గాలు…
పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వ్యక్తిగత కారణాలతో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరంగా కావడంతో సామ్‌ కర్రన్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోట్లు కుమ్మరించి సామ్‌ కర్రన్‌ను కొనుగోలు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ధావన్‌ సారథ్యంలోని పంజాబ్‌ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి.. మరో మూడో మ్యాచుల్లో ఓడింది. హర్షల్‌ పటేల్‌కు మూడు, సామ్‌ కర్రన్‌కు రెండు, రబడాకు ఒక వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి)రబడా 8, రోహిత్‌ శర్మ (సి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి)సామ్‌ కర్రన్‌ 36, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి)ప్రభ్‌సిమ్రన్‌ (బి)సామ్‌ కర్రన్‌ 78, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 34, హార్దిక్‌ పాండ్యా (సి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 10, టిమ్‌ డేవిడ్‌ (సి)సామ్‌ కర్రన్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 14, షెఫర్డ్‌ (సి)శశాంక్‌ సింగ్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 1, మహ్మద్‌ నబి (రనౌట్‌)హర్షల్‌ పటేల్‌ 0, అదనం 11. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 192పరుగులు.
వికెట్ల పతనం: 1/18, 2/99, 3/148, 4/167, 5/190. 6/192, 7/192
బౌలింగ్‌: లివింగ్‌స్టోన్‌ 2-0-16-0, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 3-9-35-0, కగిసో రబడా 4-0-42-1, హర్షల్‌ పటేల్‌ 4-0-31-3, సామ్‌ కర్రన్‌ 4-0-41-2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-21-0

➡️