T20: కమిన్స్‌ హ్యాట్రిక్‌

బంగ్లాదేశ్‌పై 28పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు
ఆంటిగ్వా: టి20 ప్రపంచ కప్‌ సూపర్‌-8లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. నార్త్‌సౌండ్‌లోని సర్‌ వివిఎన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను 140 పరుగులకే కట్టడి చేసింది. ప్యాట్‌ కమ్మిన్స్‌ హ్యాట్రిక్‌ వికెట్లకు తోడు లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్‌ హుసేన్‌ షాంటో 41, తౌహిద్‌ హఅదరు 40 పరుగులు చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 11.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100పరుగులు చేసింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిపై ఆస్ట్రేలియా 72 పరుగులు చేస్తే సరిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(53నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసాడు. ట్రావిస్‌ హెడ్‌ 31 పరుగులు చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పాట్‌ కమిన్స్‌కు లభించింది.

టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ చేసిన బౌలర్లు..

  •  బ్రెట్‌ లీ(ఆస్ట్రేలియా) బంగ్లాదేశ్‌పై, కేప్‌టౌన్‌ా2007
  • కర్టీస్‌ ఛాపర్‌(ఐర్లాండ్‌) నెదర్లాండ్స్‌పై, అబుదాబిా2021
  •  హసరంగ(శ్రీలంక) దక్షిణాఫ్రికాపై, షార్జా 2021
  • కగిసో రబడా(దక్షిణాఫ్రికా) ఇంగ్లండ్‌పై, షార్జా 2021
  • కార్తీక్‌ మయప్పన్‌(యుఎఇ) శ్రీలంకపై, గీలాండ్‌ా2022
  •  జోషూ లిట్టిల్‌(ఐర్లాండ్‌) న్యూజిలాండ్‌పై, ఆడిలైడ్‌ా2022
  • పాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా) బంగ్లాదేశ్‌పై, ఆంటిగ్వాా2024

స్కోర్‌బోర్డు..
తంజిద్‌ హసన్‌ (బి)స్టార్క్‌ 0, లింటన్‌ దాస్‌ (బి)జంపా 16, శాంటో (ఎల్‌బి)జంపా 41, రిషాద్‌ (సి)జంపా (బి)మ్యాక్స్‌వెల్‌ 2, తైహిద్‌ హ్రుదరు (సి)హేజిల్‌వుడ్‌ (బి)కమిన్స్‌ 40, షకీబ్‌ (సి అండ్‌ బి)స్టొయినీస్‌ 8, మహ్మదుల్లా (బి)కమిన్స్‌ 2, షాహిది హసన్‌ (సి)జంపా (బి)కమిన్స్‌ 0, తస్కిన్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 13, తంజిమ్‌ హసన్‌ (నాటౌట్‌) 4, అదనం 14. (20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 140పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/58, 3/67, 4/94, 5/103, 6/122, 7/122, 8/133
బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-21-1, హేజిల్‌వుడ్‌ 4-1-25-0, కమిన్స్‌ 4-0-29-3, జంపా 4-0-24-2, స్టొయినీస్‌ 2-0-24-1, మ్యాక్స్‌వెల్‌ 2-0-14-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (నాటౌట్‌) 53, హెడ్‌ (బి)రిషాద్‌ హొసైన్‌ 31, మార్ష్‌ (ఎల్‌బి)రిషాద్‌ హొసైన్‌ 1, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 14.
వికెట్ల పతనం: 1/65, 2/69
బౌలింగ్‌: మెహిదీ హసన్‌ 4-0-22-0, తంజిమ్‌ హసన్‌ 1-0-9-0, తస్కిన్‌ అహ్మద్‌ 1.2-0-22-0, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 2-0-23-0, రిషాద్‌ హొసైన్‌ 3-0-23-2.

➡️