డబ్ల్యూపీఎల్‌-2024 వేలం.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌కు భారీ ధర

Dec 10,2023 08:22 #Sports

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌-2024) వేలంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అన్నాబెల్‌ సదర్లాండ్‌ను రూ. 2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. బేస్‌ ప్రైస్‌ రూ.40 లక్షలతో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య పోటీ జరిగింది. చివరికి అన్నాబెల్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది. కాగా సదర్లాండ్‌ గత సీజన్లో గుజరాత్‌ జెయింట్స్‌ తరపున ఆడింది. సదర్లాండ్‌ ఇటీవల ముగిసిన మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌లో 304 పరుగులతో పాటు 21 వికెట్లు పడగొట్టింది.

  • అలాగే దక్షిణాఫ్రికా పేసర్‌ షబ్నిమ్‌ కనీస రూ.40 లక్షలు ఉండగా ముంబయి ఇండియన్స్‌ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.
  • ఆస్ట్రేలియా బ్యాటర్‌ లిచ్‌ఫీల్డ్‌ను రూ.1 కోటికి ఆమెను గుజరాత్‌ కొనుగోలు చేసింది.
  • ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ జార్జియా వేర్‌హామ్‌ను కనీస ధర రూ.30 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.
  • ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ డ్యానీ వాట్‌ను కనీస ధర రూ.30 లక్షల వారియర్స్‌ కొనుగోలు చేసింది.
  • అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌లో కాష్వీ గౌతమ్‌ రికార్డు ధర పలికింది. రూ.10 లక్షలు బేస్‌ ధర ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడం కోసం గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.2 కోట్లకు గుజరాత్‌ దక్కించుకుంది.
  • అన్‌క్యాప్‌డ్‌ బ్యాటర్‌ వింద్రా దినేశ్‌ కూడా భారీ ధర దక్కించుకుంది. కనీస ధర రూ.10 లక్షలు ఉండగా.. యూపీ వారియర్స్‌ రూ.1.3 కోట్లకు సొంతం చేసుకుంది.
  • అన్‌క్యాప్‌డ్‌ భారత వికెట్‌ కీపర్‌ అపర్ణ మోండల్‌ను కనీస ధర రూ.10 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది.
  • అన్‌క్యాప్‌డ్‌ భారత ఆల్‌రౌండర్‌ అమన్‌దీప్‌ కౌర్‌ ముంబయి ఇండియన్స్‌ 10 లక్షలకు కొనుగొలు చేసింది.
  • ఆల్‌రౌండర్‌ సైమా ఠాకూర్‌ను యూపీ వారియర్స్‌ వారి కనీస ధర రూ. 10 లక్షలకు దక్కించుకుంది.
  • ఆల్‌రౌండర్‌ ఎస్‌.సంజనను రూ. 15 లక్షలకు ముంబయి తీసుకుంది.
  • అన్‌క్యాప్‌డ్‌ భారత స్పిన్నర్‌ ప్రియా మిశ్రా కనీస ధర రూ.10 లక్షలు ఉండగా గుజరాత్‌ జెయింట్స్‌ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
➡️