ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 20:46

పరీక్షలకు హాజరయిన విద్యార్థులు

– ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ
– 22,406 మంది విద్యార్థులు హాజరు
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌
జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 23,120 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 22,406 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 714 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పాటు ఆర్‌ఐఒ గురువయ్య శెట్టి బృందాలతో పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పరీక్షలను నిర్వహించామన్నారు. మాల్‌ ప్రాక్టీసింగ్‌ కేసులు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. డ

➡️