ప్రజల వద్దకే పాలన : ‘గడికోట’

ప్రజాశక్తి-చిన్నమండెం గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందు తుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనమలలో ఒకే ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ భవనాలును జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాధరెడ్డితో కలసి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలంది స్తున్నారని అన్నారు. ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. వాలం టీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని అన్నారు. గ్రామ సచివాలయాలకు కోట్లాది రూపాయలుతో శాశ్వత కార్యాల య భవనాలను నిర్మించి పల్లెల మార్పుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాయచోటి నియోజక వర్గంలో 73 సచివాలయాల నిర్మాణాలకు గాను 67 పూర్తి అయ్యాయని, 70 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గాను 60 పూర్తి అయ్యాయని, ,60 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణాలకు గాను 45 పూర్తి అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో సింగల్‌ విండో అధ్యక్షుడు గోవర్ధన్‌ రెడ్డి, సర్పంచ్‌లు నజీర్‌ అహమ్మద్‌, లక్ష్మిరెడ్డి, ఎంపిటిసిలు ఎజాస్‌అలీఖాన్‌, శ్యామ్‌చంద్ర, జెసిఎన్‌ మండల కన్వీనర్‌ చుక్కా అంజనప్ప, జెసిబి శేఖర్‌, మురళి, రాజు, ఆనంద్‌, హసన్‌ భాషా, భాస్కర్‌ నాయుడు, చంద్రపాల్‌, రెడ్డి శేఖర్‌, వెంకటేశ్వర్లు, మల్‌రెడ్డి, యహియాఖాన్‌, జహీర్‌ఖాన్‌, జయశంకర్‌ రెడ్డి, బురాన్‌ఖాన్‌, రమణ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.భూ పంపిణీతో శాశ్వత ప్రయోజనంగాలివీడు : ఏళ్ల తరబడి నుంచి భూమి సాగు చేసుకుని హక్కులు లేని రైతులకు, భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీతో శాశ్వత ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గాలివీడులో జరిగిన ఫ్రీ హోల్డ్‌ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ తొలివిడత అసైన్మెంట్‌ కమిటీకి సంబంధించి 118 పట్టాదారులకుగాను 141.36 ఎకరాల విస్తీర్ణపు భూములుకు, చుక్కల భూములు లబ్దిదారులు1815, విస్తీర్ణం 1986 ఎకరాలును, ఇమామ్‌ భూములకు సంబంధించి 604 మంది పట్టాదారులకు 547.15 ఎకరాల విస్తీర్ణాన్ని రైతులకు పట్టాలుగా ఇచ్చినట్లు తెలిపారు. లబ్దిదారులకు పట్టాలు అందచేసి, వాటికి సమ గ్రమైన రికార్డు లతో అందిస్తున్నారన్నారు. ఇనాం భూములకు సంబంధించి 604 మంది పట్టాదారులకు 547.15 ఎకరాల విస్తీర్ణాన్ని రైతులకు పట్టాలుగా ఇస్తున్నట్లు తెలిపారు.2004-2009 కాలంలో వైఎస్‌ఆర్‌ హయాంలో పేదలకు భూప ట్టాల పంపిణీ జరిగిందని, ఇప్పుడు జగన్‌ పాలనలో చారిత్రాత్మకంగా భూప ట్టాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో సింగల్‌ విండో అధ్యక్షుడు వేదమూర్తిరెడ్డి, మండల కన్వీనర్‌ యదుభూషన్‌రెడ్డి, ఎస్‌కె ఖాదర్‌ మోహిద్దీన్‌, వైస్‌ ఎంపిపి శ్రీనివాసులు, మాజీ ఎంపిపి బండి చిన్నరెడ్డి, గుమ్మా అమరనాధ రెడ్డి, సర్పంచ్‌లు దీప్తి, ఉమాపతిరెడ్డి, కేశవ రెడ్డి, ఉమా ప్రభాకర్‌, కాల్వపల్లె జానకమ్మలు పాల్గొన్నారు.

➡️