బ్రెజిల్‌లో కార్చిచ్చుల బీభత్సం..!

Mar 14,2024 12:40 #Brazil, #The horror of fire

బ్రెజిల్‌:దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్‌ దాదాపు 60 శాతం మేర అమెజాన్‌ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సఅష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్‌ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా కనపడుతోంది. బ్రెజిల్‌ దేశ పరిమాణంలో రొరైమా కేవలం 2.6 శాతమే అయిన గడిచిన నెలలో ఏకంగా రెండు వేలకు పైగా కార్చిచ్చులు సంభవించాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం అవుతుంది. బ్రెజిల్‌ దేశ వ్యాప్తంగా నమోదైన కారిచ్చుల్లో కేవలం రొరైమా ప్రాతంలోనే ఏకంగా 30 శాతం వరకు నమోదయ్యాయి.

➡️