ఐస్‌లాండ్‌లో మరోసారి బద్దలైన భారీ అగ్నిపర్వతం

Mar 17,2024 09:16 #Another, #Iceland, #volcano erupted

రెగ్జావిక్‌ (ఐస్‌లాండ్‌) : ఐస్‌లాండ్‌లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగవసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి రెండువైపులా విరజిమ్ముతోంది.

రాజధాని రెగ్జావిక్‌ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందుగానే హెచ్చరించారు. గత రెండు రోజుల క్రితం ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. దాని నుండి వెలువడిన లావా జనావాసాల్లోకి చేరడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. అక్కడి ప్రజలంతా తమ పెంపుడు జంతువులతో సహా స్థావరాలను ఖాళీ చేసిన సంగతి విదితమే. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఐస్‌లాండ్‌లో 30 వరకు యాక్టివ్‌ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అగ్నిపర్వతాలు బద్దలవుతోన్న నేపథ్యంలో … ఇప్పటికే ఈ దేశంలోని పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

➡️