అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి

Jan 23,2024 11:54 #fireing, #gun fir, #usa

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సష్టించాయి. అమెరికాలోని చికాగో శివారులోని మూడు ప్రదేశాల్లో ఓ వ్యక్తి ఆదివారం, సోమవారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఏకంగా 8 మంది చనిపోయారు. నిందితుణ్ని రోమియో నాన్స్‌గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్‌ ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని.. అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

➡️