మెక్సికోలో దారుణం.. పార్టీలో కాల్పులు ఆరుగురి మృతి

Dec 30,2023 12:02 #gun fir, #Mexico
  • 26 మందికి తీవ్ర గాయాలు.. వారిలో నలుగురి పరిస్థితి విషమం

మెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీలో నలుగురు దుండుగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికోలోని సియుడాడ్‌ ఒబ్రెగాన్‌ నగరంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు 18 ఏళ్లలోపు వారు ఉన్నారని.. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులున్నారని అధికారులు తెలిపారు.

➡️