మరో బోయింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ 

Jan 14,2024 13:09 #Boeing, #Japan

టోక్యో :    ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 737-800 కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు కనిపించడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. శనివారం జపాన్‌లో ఈ ఘటన జరిగింది. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారని సంస్థ తెలిపింది.  ”సపోరో-న్యూ చిటోస్‌ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్‌ 1182 టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు కనిపించాయి. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 శ్రేణిలోనిది కాదు” అని ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలో గత వారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ ప్లగ్‌ గగనతలంలో ఊడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.

➡️