బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం : 25 మంది మృతి

Jan 9,2024 09:11 #25, #Brazil, #Fatal accident, #people died

బ్రెజిల్‌ : బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన లోతట్టు బహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్‌ రహదారిపై టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో దాదాపు 25మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని బహియా సివిల్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️