రష్యాపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడి తీవ్ర వ్యాఖ్యలు

ఫ్రాన్స్‌ : రష్యాపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుంటుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి. ఈ సమయంలోనే రష్యాపై మెక్రాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది జులైలో జరగనున్న ఒలింపిక్స్‌ వేడుకలకు పారిస్‌ సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒలింపిక్స్‌ వేడుకలు జరగనున్న ప్రాంతాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సందర్శించారు. అక్కడ ఓ నూతన క్రీడా విభాగాన్ని ప్రారంభించారు. ఆయన పారిస్‌ క్రీడలపై విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు.

➡️