ఆస్పత్రిలో చేరిన హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్‌

పోర్ట్‌-ఓ -ప్రిన్స్‌ :    హైతీ తాత్కాలిక ప్రధాన మంత్రి గ్యారీ కొనిల్‌ ఆస్పత్రిపాలయ్యారు. శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొంది. అయితే ఆయన ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలను వెల్లడించలేదు. వారం రోజుల పాటు తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఆ ప్రకటనలో తెలిపింది.

మే 28న గ్యారీ కొనిల్లే హైతీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. శ్వాస కోస సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. యునిసెఫ్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన ఆయన జూన్‌ 1న హైతీకి చేరుకున్నారు.

➡️