ఫ్యామిలీ స్పాన్సర్‌ వీసా జారీని కఠినతరం చేసిన యూకే

Apr 12,2024 13:16
  •  కనీస ఆదాయ పరిమితి 18,600 పౌండ్ల నుంచి 29,000 పౌండ్లకు పెంపు

యూకేకి విదేశీ వలసలను తగ్గించాలనే ప్రణాళికల్లో భాగంగా ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ మెంబర్‌ వీసాను స్పాన్సర్‌ చేయడానికి అవసరమైన కనిష్ఠ ఆదాయ పరిమితిని ఏకంగా 55 శాతం మేర పెంచింది. ప్రస్తుత ఆదాయ పరిమితి 18,600 పౌండ్లుగా ఉండగా దానిని 29,000 పౌండ్‌లకు చేర్చుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక వచ్చే ఏడాది ఈ పరిమితి 38,700 పౌండ్‌లకు చేరుతుందని, సంవత్సరం ఆరంభం నుంచే నూతన ఆదాయ పరిమితి ఆచరణలోకి వస్తుందని యూకే ప్రభుత్వం వివరించింది.

➡️