గ్రేటర్‌ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Mar 13,2024 10:26 #Fire Accident, #Greater Noida

నోయిడా: గ్రేటర్‌ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్‌ మూర్తి చౌక్‌ వద్ద ఉన్న ఈటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ దాబాలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ నుంచి మంటలు మిగితా దాబాలకు విస్తరించాయి. అయితే ఏ కారణం వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టం కావడం లేదు. మంటల్ని ఆర్పేందుకు 8 ఫైర్‌ ఇంజిన్లు వచ్చాయి.

➡️