జెఎన్‌యులో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం

Mar 24,2024 23:50 #great success, #SFI alliance

సెంట్రల్‌ ప్యానెల్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన కూటమి
మట్టికరిచిన మతోన్మాద ఎబివిపి
42 కౌన్సిలర్లలో 30 స్థానాలను గెలుచుకున్న ఎస్‌ఎఫ్‌ఐ కూటమి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలోనే ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి పోస్టులతో కూడిన సెంట్రల్‌ ప్యానెల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. బిజెపి అనుబంధ ఎపిబివి మట్టికరించింది. ఎన్ని కుయుక్తలకు పాల్పడినప్పటికీ ఎబివిపి ఓటమి చెందాల్సి వచ్చింది. ఎబివిపిని, దాని మతోన్మాద సిద్ధాంతాన్ని జెఎన్‌యు విద్యార్థులు తిరస్కరించారు. అధికారులతో కుమ్మక్కైన ఎబివిపి విధ్వంసక ప్రయత్నాలను ఓడించి, ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం సాధించింది.
ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డిఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌తో కూడిన వామపక్ష విద్యార్థి కూటమి తరపున అధ్యక్ష పదవికీ పోటీ చేసిన ధనంజరు 2,973 ఓట్లు, ఉపాధ్యక్షుడు అవిజిత్‌ ఘోష్‌ 2,649 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంషి ఆర్య 3,307 ఓట్లు, సహాయ కార్యదర్శి మో సాజిద్‌ 2,893 ఓట్లతో ఘన విజయం సాధించారు.

అధ్యక్ష పదవికి ఎబివిపి తరపున పోటీ చేసిన ఉమేష్‌ చంద్ర అజ్మీరా (2,118 ఓట్లు)పై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి ధనంజరు 3,100 ఓట్లతో విజయం సాధించారు. బాప్సా తరపున పోటీ చేసిన బిస్వజిత్‌ మింజికు 282 ఓట్లు వచ్చాయి. ఉపాధ్య పదవికి ఎబివిపి తరపున పోటీ చేసిన దీపికా శర్మ (1,848 ఓట్లు)పై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి అవిజిత్‌ ఘోష్‌ 2,762 ఓట్లు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బాప్సా తరపున పోటీ చేసిన మొహమ్మద్‌ అనాస్‌కు 463 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవికి ఎబివిపి తరపున పోటీ చేసిన అర్జున్‌ ఆనంద్‌ (2,412 ఓట్లు)పై ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి ప్రియాంషి ఆర్య 3,440 ఓట్ల భారీ తేడాపై తో గెలుపొందారు. సహాయ కార్యదర్శి పదవికీ ఎబివిపి తరపున పోటీ చేసిన గోవింద్‌ డాంగి (2,591 ఓట్లు)పై కుటమి అభ్యర్థి మో సాజిద్‌ 3,035 ఓట్లతో ఘన విజయం సాధించారు. 42 మంది కౌన్సలర్లలో 30 మంది ఎస్‌ఎఫ్‌ఐ కూటమికి చెందినవారు.

➡️