బోయింగ్‌ విమానాల నిర్వహణపై అప్రమత్తమైన భారత్‌

Dec 31,2023 16:37 #Boeing 737 Max, #DGCA, #Indian Airlines

న్యూఢిల్లీ  :   కొత్తగా నిర్మించిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో లూజ్‌ బోల్ట్‌ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఈ విమానాలను నిర్వహించే ఆకాశ ఎయిర్‌, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆదివారం ప్రకటించింది. అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌, బోయింగ్‌తో తాము టచ్‌లో ఉన్నామని, బోల్టులను సరి చూస్తున్నట్లు వెల్లడించింది.

”విమానంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సర్వీస్‌ ఆపరేటర్లు సూచనలు జారీ చేస్తారు. ఈ విషయంలో బోయింగ్‌, ఎఫ్‌ఏఏతో సంప్రదింపులు జరుపుతున్నాం. సమస్య నివారణకు బోయింగ్‌ చెప్పిన చర్యలను విమానాల ఆపరేటర్లు చేపడతారు” అని డిజిసిఎ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే సంస్థ తమదని ఆకాశ ప్రతినిధి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అపరేటర్‌ల మాదిరిగానే అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, తయారీదారు లేదా రెగ్యులేటర్‌ సిఫారసు చేసిన తనిఖీలు మరియు విధానాలను అనుసరిస్తుందని తెలిపారు. అన్ని ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లకు బోయింగ్‌ గ్లోబల్‌ సిఫారసుల ప్రకారం..అన్ని సూచనలను తాము ఎయిర్‌ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ పరిణామాలు తమ సంస్థ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పైస్‌ జెట్‌ ప్రతినిధి వెల్లడించారు.

➡️