హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

సిమ్లా : రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. ఎమ్మెల్యేలు రాజిందర్‌ రాణా, సుధీర్‌ శర్మ, ఇందర్‌ దత్‌ లఖన్‌పాల్‌, దేవీందర్‌ భుట్టో, రవి ఠాకూర్‌, చైతన్యశర్మలను అనర్హులుగా స్పీకర్‌ కుల్దీప్‌ పటానియా గురువారం ప్రకటించారు. బుధవారం ఆ ఆరుగురు సభ్యులు సభకు హాజరయ్యారని, అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సభలో లేరని స్పీకర్‌ తెలిపారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించినందున ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ఇది తక్షణం అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంతో రాష్ట్రం నుంచి ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ సింఘ్వీ ఓటమి పాలవగా, బిజెపికి చెందిన హర్ష్‌ మహాజన్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే.

➡️