ఫిబ్రవరి 16న ఐక్య ఆందోళన

Jan 6,2024 09:53 #16, #February, #united agitation
  • రైతులు, కార్మికుల దేశవ్యాప్త ప్రదర్శనలు, పికెటింగ్‌లు,రైల్‌ రోకో, జైలు భరో
  • కార్పొరేట్‌, మతోన్మాద విద్వేష, విభజన విధానాలపై ప్రతిఘటన
  • ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడి వేదిక పిలుపు
  • అన్ని వర్గాల మద్దతు కోరిన ఉమ్మడి వేదిక

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు ఉమ్మడి ఆందోళనలు చేయనున్నారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, పికెటింగ్‌లు, రైల్‌ రోకో, జైలుభరో రూపంలో ఆందోళనకు భారీస్థాయిలో సమీకరించాలని రైతు, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యలు ఉమ్మడి వేదిక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, వాహన కవాతు కోసం ఎస్‌కెఎం పిలుపునకు మద్దతిచ్చింది. ‘కార్పొరేట్‌, మతోన్మాద స్నేహంతో జరుగుతున్న విధ్వంసక, విభజన, అధికార విధానాలను ప్రతిఘటించడం, నిర్ణయాత్మకంగా ఓడించ డం, వాటిని కార్మిక, రైతు, ప్రజా అనుకూల విధానాలతో భర్తీ చేయడం’ లక్ష్యంగా ఈ ఆందోళన జరుగుతుంది. ‘రైతు, కార్మిక ఉమ్మడి వేదిక ఆందోళనకు మద్దతు ఇవ్వాలని విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు, సామాజిక ఉద్యమాలు, కళ, సంస్కృతి, సాహిత్య రంగాల్లోని అన్ని సమాన ఆలోచనలు గల ఉద్యమాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము’ అని పేర్కొంది. ఉద్యమ డిమాండ్లను ఆమోదించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘అన్ని పంటలకు మద్దతు ధర సి2ప్లస్‌50 శాతంతో పంటల సేకరణ హామీ, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు రుణభారం నుండి విముక్తి కోసం చిన్న, మధ్య తరగతి వ్యవసాయ కుటుంబాలకు సమగ్ర రుణమాఫీ, నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించు కోవడం, ప్రాథమిక హక్కుగా ఉపాధి హామీ, రైల్వే, డిఫెన్స్‌, ఎలక్ట్రిసిటీ తదితరాలతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించడం ఆపాలి’ వంటి డిమాండ్లను పరిష్కరిం చాలి. ‘ఉద్యోగాల కాంట్రాక్టీకరణ ఆపాలి, ఉపాధి హామీ కింద ప్రతి వ్యక్తికి రోజుకు రూ.600 వేతనంతో ఏడాదికి 200 రోజుల పని కల్పించాలి. పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలి. ఎల్‌ఎఆర్‌ఆర్‌ చట్టం 2013 అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేసింది.

‘పాలక కార్పొరేట్‌, మతపరమైన అనుబంధం దేశాన్ని దోచుకుంటుంది. జాతీయ ఆస్తులు, ఫైనాన్స్‌లను కొన్ని ప్రైవేట్‌ కార్పొరేట్లకు అప్పగించడం, దేశ ప్రజాస్వామ్యంలోని అన్ని సంస్థలనూ స్తంభింపజేయడం, స్వాధీనం చేసుకోవడం చేస్తుంది’ అని విమర్శించింది. ‘ఈ ప్రభుత్వం మొత్తం శ్రమిస్తున్న ప్రజల జీవితాలు, జీవనోపాధిపై నిరంతరం అనాగరిక దాడులు కొనసాగిస్తోంది. వివిధ చట్టాలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, విధాన డ్రైవ్‌లో కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలను దూకుడుగా కొనసాగిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం.

ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, ఇది వివిధ వర్గాల ప్రజల అన్ని ప్రజాస్వామ్య వాదనలను, అన్ని అసమ్మతి స్వరాలను అణిచివేస్తోంది. ఇది రాజకీయాలను, రాజ్యాంగ సంస్థలను వర్గీకరణ చేయడం, పరిపాలనా అధికారులను, కేంద్ర ఏజెన్సీలను పూర్తిగా దుర్వినియోగం చేయడమనే ప్రమాదకరమైన గేమ్‌ ప్లాన్‌తో కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తుంది. బాధితులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్థులను రక్షిస్తుంది. దీంతో శాంతి భద్రతలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది.

➡️