భద్రతా వైఫల్యంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్‌ .. ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపిలు ఉభయ సభల్లోనూ గురువారం  వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభలోని ఇతర వ్యవహారాలను సస్పెండ్‌ చేయాలని కోరడంతో పాటు ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.దీంతో ఉభయ సభలు తాత్కాలికంగా  వాయిదా పడ్డాయి.

బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో సమయంలో ఇద్దరు వ్యక్తులు సభలోకి ప్రవేశించి కలర్‌స్మోక్‌ వదులుతూ హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్లమెంట్‌ వెలుపల మరో ఇద్దరు పొగను వదులుతూ నిరసన తెలిపారు. ఈ నలుగురిపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల (నిరోధక ) చట్టం (యుఎపిఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. నేడు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

➡️