సిఎఎ అమలును అడ్డుకోలేరు : అమిత్‌ షా

Dec 27,2023 14:32 #Amit Shah, #CAA

కోల్‌కతా :  పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.  ఇది దేశ చట్టమని అన్నారు.   పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం కోల్‌కతాలోని నేషనల్‌ లైబ్రరిలో జరిగిన రాష్ట్ర బిజెపి సోషల్‌ మీడియా మరియు ఐటి వింగ్‌ సభ్యుల సమావేశంలో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. సిఎఎను అమలు చేయడం పార్టీ నిబద్ధత అని అన్నారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 35 స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి 18 సీట్లను గెలుచుకుందని అన్నారు.

కాగా, సిఎఎని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. బిజెపియేతర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీల్లో తీర్మానాలను ప్రవేశపెట్టారు.

➡️