ఉదయనిధి, రాజాలకు ఊరట

-సనాతన ధర్మంపై వ్యాఖ్యల కేసులో వారెంట్‌ ఇవ్వలేం

– తేల్చి చెప్పిన మద్రాసు హైకోర్టు

చెన్నై: సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకులు ఉదయనిధి స్టాలిన్‌, మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులకు కో ావారెంటు జారీ చేయాలన్న అభ్యర్థనను మద్రాస్‌ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఉదయనిధితో పాటు ధర్మాదాయ శాఖ మంత్రి పికె శేఖర్‌బాబు, నీలగిరి పార్లమెంట్‌ సభ్యులు ఎ. రాజాలను చట్టసభ సభ్యులుగా కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. వీరిపై ఎలాంటి నేరారోపణలు లేనందున కోావారెంట్‌ జారీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని జస్టిస్‌ అనితా సుమంత పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ”సనాతన ధర్మం హెచ్‌ఐవి లాంటిది. దీనిని నిర్మూలించాలి” అని వ్యాఖ్యానించారు.

➡️