హిమాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

Apr 5,2024 07:49 #Earthquake, #Himachal Pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో రాష్ట్రంలోని చంబా పట్టణంలో ఈ రోజు భూకంపం వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ ప్రకటించింది. ఈ భూకంపం కారణంగా చండీగఢ్‌ నగరంతో పాటు పంజాబ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. చంబాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. భూమికి దిగువన 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పింది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని హిమాచల్‌ ప్రదేశ్‌ అధికారులు తెలిపారు. ”కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. నేను భవంతి నుంచి కిందకు దిగిపోదామనుకుంటున్న సమయంలో ప్రకంపనలు నిలిచిపోయాయి” అని స్థానికుడు ఒకరు తెలిపారు.

➡️