పొగమంచు ప్రభావం.. ఢిల్లీలో జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ

Dec 27,2023 10:48 #Delhi, #POGA MANCHU
  •  పొగమంచు ప్రభావంతో 110 విమానాలు, 25 రైళ్లు ఆలస్యం
  • ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ఢిల్లీ : ఢిల్లీని పొగమంచు కప్పేసింది. బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం మూడుగంటల పాటు విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోయింది. పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 110 విమాన రాకపోకలపై ప్రభావం చూపింది. అలాగే, 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో చలిగాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా ప‌డిపోతుండ‌టంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

➡️