శ్మశానవాటిక గోడకూలి నలుగురు మృతి

Apr 21,2024 12:15 #collapse, #cremation wall

చండీగీఢ్‌: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్మశానవాటిక గోడ కూలి నలుగురు చనిపోయారు. గురుగ్రామ్‌లోని అర్జున్‌ నగర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున శ్మశాన వాటిక గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించేలోగా తీవ్రంగా గాయపడ్డ 11 ఏండ్ల తాన్యా, దేవి దయాళ్‌(70), మనోజ్‌గాబా(54), కృష్ణకుమార్‌ (52) మృతిచెందారు. దీపాప్రదాన్‌ అనే మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

➡️