మానవ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖాకు బెయిల్‌..

న్యూఢిల్లీ  :    భీమా కొరెగావ్  కేసులో ప్రముఖ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖాకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్‌ జారీ చేసింది. జస్టిస్‌ ఎస్‌.గడ్కరీ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ లక్షరూపాయిల పూచీకత్తుతో బెయిల్‌ అనుమతించింది.

సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసేందుకు వీలుగా ఆరువారాల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కోర్టును కోరింది. దీంతో ఈ ఉత్తర్వులపై ధర్మాసనం మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు ప్రక టించింది. 2018 ఆగస్టులో అక్రమంగా అరెస్టయిన గౌతమ్‌ నవలఖాను గృహనిర్బంధంలో ఉంచేందుకు గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఆయన నవీముంబయిలోని తన నివాసంలో ఉంటున్నారు.

కాగా, ఈ కేసులో అక్రమంగా అరెస్టై, బెయిల్‌ పొందిన వారిలో గౌతమ్‌ నవలఖా ఏడవవ్యక్తి.     రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నవలఖా హైకోర్టులో అప్పీల్‌ చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

➡️