Heatwaves – ఉత్తరాదిపై నిప్పులు కురిపిస్తున్న భానుడు

యుపి : ఉత్తరాదిలో భానుడు నిప్పులుకురిపిస్తున్నాడు. తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో వేడి తీవ్రతతో అవస్థలుపడుతున్నారు. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ నెల 17 వరకు వేడిగాలుల ప్రభావం కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, నాసిక్‌, రాజస్థాన్‌, ఢిల్లీ వంటి ప్రాంతాలు ముఖ్యంగా వేడిగాలులతో ప్రభావితమయ్యాయి, ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మంచినీళ్లకు ఇబ్బందులుపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో బావులు ఎండిపోవడంతో పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. కొన్ని చోట్ల అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

➡️