Covid : 700కిపైగా కొత్త కేసులు.. ఏడుగురు మృతి

Dec 30,2023 13:53 #Covid Cases

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. కరోనా వల్ల ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,997కి పెరిగింది. ఈ వైరస్‌ వల్ల శుక్రవారం ఒక్కరోజే కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. తాజా మరణాలతో కలిసి ఇప్పటివరకు కరోనా ప్రారంభం నుంచి 5,33,358 మంది వైరస్‌కి బలయ్యారు.

కాగా, డిసెంబర్‌ 29వ తేదీన 41,797 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్స్‌ నివేదిక పేర్కొంది. ఇక డిసెంబర్‌ 28వ తేదీకల్లా దేశవ్యాప్తంగా కోవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు 145 నమోదయ్యాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

➡️