మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు : నలుగురు మృతి

Dec 23,2023 12:00 #Covid Cases

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 752 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం ఒక్కరోజే కరోనా వల్ల నలుగురు మృతి చెందారు. నిన్నటి కంటే ఈరోజుకి 423 యాక్టివ్‌ కేసులు పెరిగాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనే యాక్టివ్ కేసులు పెరిగాయి. కేరళలో 266, కర్ణాటకలో 66 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారానికి ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

కాగా భారత్‌లో జెఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోవాలో ఇప్పటివరకు 21 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇక కేరళలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 565 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

➡️