జాంబియాకు భారత్‌ సాయం

Feb 6,2024 14:37 #humanitarian, #India, #Zambia

న్యూఢిల్లీ :   తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాంబియాకు భారత్‌   సాయం అందించింది. మందులతో సహా సుమారు 3.5 టన్నుల సాయాన్ని పంపినట్లు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. వాణిజ్య కార్గో యుద్ధ విమానంలో పంపినట్లు వెల్లడించారు. 3.5 టన్నుల నీటిశుద్దీకరణ సామాగ్రి, క్లోరిన్‌ మాత్రలు, ఒఆర్‌ఎస్‌ సాచెట్‌లు ఉన్నట్లు ప్రకటించారు.

జాంబియాలో కలరా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు సుమారు 600 మంది కలరాతో మరణించారు. దేశంలోని మొత్తం పది ప్రావిన్స్‌ల్లో తొమ్మిదింటిలో వ్యాధి వ్యాప్తి చెందింది.

➡️