భారతీయ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Mar 8,2024 15:25 #President Murmu, #Women's Day

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నారీశక్తిని సంబరంగా జరుపుకునే సందర్భం ఇది. మహిళలు సాధించిన పురోగతి ఆధారంగానే.. సమాజ ప్రగతిని కొలవగలం. క్రీడల నుంచి సైన్స్‌ వరకూ భారతీయ మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. దేశం గర్వించేలా చేస్తున్నారు. యువతుల మార్గంలోని అడ్డంకుల్ని తొలగించడానికి మనం కలిసి పని చేద్దాం.’ అని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

➡️