ఐఐఎంబి ఫ్యాకల్టీ నియామకాల్లో ఎస్‌టిలకు మొండి చేయి

Jan 22,2024 11:06 #IIM Bangalore, #Karnataka

బెంగళూరు : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరు (ఐఐఎంబి) ఫ్యాకల్టీ సభ్యులుగా ఎస్‌టిలకు అవకాశం రావడం లేదు. 2021 జనవరి నుంచి 2023 జూన్‌ వరకూ ఎస్‌టి కేటగిరిలో నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినా ఒక్క అభ్యర్థినీ ఫ్యాకల్టీగా నియమించలేదని ఆర్‌టిఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో ఐఐఎంబి తెలిపింది. ఆ సమయంలో జనరల్‌ కేటగిరిలో 23 మంది ఎంపికవగా, 17 మందే ఉద్యోగాల్లో చేరారు. ఎంపికైన ఇద్దరు ఎస్‌సి అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. ఎస్‌టి అభ్యర్థి ఒక్కరికి కూడా ఐఐఎంబి అవకాశం ఇవ్వలేదు. ఒబిసిల నుంచి ఎనిమిదిమందికి ఉద్యోగాలొచ్చాయి. 22 మంది వికలాంగులు, 23 మంది ఆర్థికంగా బలహీన వర్ఘం (ఇడబ్ల్యూఎస్‌) నుంచి దరఖాస్తు చేసుకున్నా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఐఐఎంబిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీలలో 10 మంది ఒబిసిలు, ఐదుగురు ఎస్‌సిలు, ఒక ఎస్‌టి ఉన్నారు.

➡️