కన్నూర్‌ విసి పునర్‌ నియామకం’పై కేరళ రివ్యూ పిటీషన్‌

Dec 31,2023 11:14 #Kannur University, #Kerala Govt

న్యూఢిల్లీ :  కన్నూర్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్‌ నియామకాన్ని రద్దు చేస్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం శనివారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. గోపీనాధ్‌ వైస్‌ ఛాన్సలర్‌గా అర్హతపై ఎవ్వరిటీ ఎలాంటి సందేహాలు లేవని, పిటిషనర్లు కూడా లేవనెత్తని వాదన ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేరళ ప్రభుత్వం తన రివ్యూ పిటిషన్‌లో పేర్కొంది.  డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ గొప్ప విద్యావేత్త అని పేర్కొంటూ, రివ్యూ పిటిషన్‌లో ఆయన సాధించిన విజయాలను కేరళ ప్రభుత్వం ప్రస్తావించింది. అలాగే ఈ పిటీషన్‌ను బహిరంగ కోర్టులో విచారించాలని కూడా పిటిషన్‌లో కేరళ ప్రభుత్వం కోరింది. కన్నూర్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ను మరోసారి నియమిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నవంబర్‌ 30న రద్దు చేసింది.

➡️