జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకర్‌ లహోటి

చెన్నై: దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిబుల్‌ ఐటిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్‌ – 2024 పరీక్షలో మొదటి ర్యాంక్‌ ఢిల్లీ జోన్‌కు చెందిన 17 ఏళ్ల వేద్‌ లహోటి సాధించాడు. అతను తన లొలి ప్రయత్నంలోనే దీనిని సాధించడం విశేషం. అదలా ఉంచితే మొదటి పది ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. ఈ సారి జెఇఇ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షలను నిర్వహించిన ఐఐటి మద్రాస్‌ ఆదివారం నాడు ఈ ఫలితాలను విడుదల చేసింది.

జెఇఇ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షకు మొత్తం 1.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా 48,248 మంది ఐఐటీల్లో ప్రవేశానికి క్వాలిఫై అయ్యారు. వీరిలో మహిళా అభ్యర్థులు 7,964 మంది కాగా, వికలాంగులు 594 మంది ఉన్నారు. మొత్తం క్వాలిఫై అయిన వారిలో ఓపెన్‌ కేటగిరి నుంచి 14,083 మంది, ఒబిసికి కేటగిరి నుంచి 9,281 మంది, ఇబిసి కేటగిరి నుంచి 5,423 మంది, ఎస్‌సి కేటగిరి నుంచి 13,794 మంది, ఎస్‌టి కేటగిరి నుంచి 5,073 మంది ఉన్నారు. . మొత్తం 360 మార్కులకు 355 మార్కులను సొంతం చేసుకున్నాడు. అలాగే మహిళా అభ్యర్థుల కేటగిరిలో ఐఐటి బాంబే జోన్‌కు చెందిన ద్విజ ధర్మేష్‌కుమార్‌ పటేల్‌ టాప్‌ ప్లేస్‌ను సాధించారు. 360 మార్కులకు గాను 332 మార్కులు సాధించారు. ఫలితాలను జెఇఇఎడివి.ఎసి.ఇన్‌ అనే వైబ్‌సైట్‌లో పొందుపర్చారు.

సత్తా చాటిన తెలుగు తేజాలు
జెఇడి (అడ్బాన్స్‌డ్‌)లో ఈసారి కూడా తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. మొదటి పది ర్యాంకుల్లో నలుగురు తెలుగు విద్యార్ధులు ఉన్నారు. బోగపల్లి సందీప్‌ మూడో ర్యాంకు (338 మార్కులు), పుట్టి కుషల్‌ కుమార్‌ ఐదో ర్యాంకు (334 మార్కులు), కోడూరు తేజేశ్వర్‌ ఎనిమిదో ర్యాంకు (331 మార్కులు), అల్లడబోయిన సిద్ధిక్‌ సుహాన్‌ పదో ర్యాంకు (329 మార్కులు) సాధించారు. మే 26న నిర్వహించిన జెఇఇ పేపర్‌ 1, 2 పరీక్షలకు 1,80,200 మంది హాజరయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 7,964 మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐఐటి ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి (355), ఆదిత్య (346) మార్కులతో టాప్‌ టు ర్యాంకులు సాధించారు.

కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా : తేజేశ్వర్‌

ఐఐటి ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని అనుకుంటున్నాను. జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్‌, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ‘ఫిట్జీ’ అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లనే ఈ ర్యాంక్‌ సాధించాను.

➡️