ఇడి సమన్లపై స్పందించిన మహువా మొయిత్రా

Mar 31,2024 17:14 #ED summons, #Mahua Moitra

కోల్‌కతా :     ఇడి సమన్లపై టిఎంసి నేత, కృష్ణానగర్‌ అభ్యర్థి మహువా మొయిత్రా ఆదివారం మరోసారి స్పందించారు. దేశ ప్రజలు, ముఖ్యంగా తన నియోజకవర్గమైన కఅష్ణానగర్‌ ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. బిజెపి తనను వెంటాడిన ప్రతిసారీ తనకు ప్రజల మద్దతు పెరుగుతోందని అన్నారు. ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఇడి ఇటీవల మొయిత్రాకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తాను ఇడి విచారణకు హాజరు కాలేనని మహువ మొయిత్రా స్పష్టం చేశారు. ఇడి పని ఇడి అధికారులు చేస్తున్నారని, తన పని తాను చేసుకుపోతానని అన్నారు. ప్రధాని మహిళా సంక్షేమం గురించి ప్రధాని పదేపదే మాట్లాడతారు కానీ మణిపూర్‌లో పరిణామాలపై మాత్రం నోరుమెదపరని మండిపడ్డారు. మహిళల కోసం ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది మహిళలకు తెలుసునని అన్నారు.

➡️