మోడీ ద్వంద్వ ప్రమాణాలు : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్‌ ఐజాక్‌

న్యూఢిల్లీ : మోడీ ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలవుతున్నాయంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్‌ ఐజాక్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ” మోదీ ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలు అవుతున్నాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అతను 14వ యుఎఫ్‌సి నుండి 50 శాతం వాటా కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. కానీ పిఎం మోడీగా అతను యుఎఫ్‌సి ఛైర్మన్‌తో చర్చలు జరిపి యుఎఫ్‌సి సిఫార్సు చేసిన 42 శాతం రాష్ట్రాల వాటాను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించారు – ఇది తీవ్రమైన రాజ్యాంగ అనుచితం. ” అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

➡️