ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు : యుజిసి

న్యూఢిల్లీ :   ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్‌లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌ అడ్మిషన్‌లు నిలిపివేయాలని అన్ని యూనివర్సిటీలను యుజిసి సెక్రటరీ మనీష్‌ జోషి ఆదేశించారు. ఎంఫిల్‌ అడ్మిషన్‌ కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు తమ దఅష్టికి వచ్చిందని, ఎంఫిల్‌ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నతవిద్యా సంస్థలు అందించరాదంటూ యుజిసి నిబంధనలు -2022 రెగ్యులేషన్‌ నెంబర్‌ 14 స్పష్టంగా చెబుతోందని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్‌లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసే చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపింది.

➡️